Thursday, 22 December 2016

రంగు రంగు చేపలను పెంచడం ఎలా?

వ్యాపకం. ఇది లేని మనిషి ఉండదు.  ఒకరికి చెట్లను పెంచడం అంటే ఇష్టం, ఇంకొకరికి ఆటలు ఆడటం అంటే ఇష్టం, మరొకరికి పశు పక్షాదులను పెంచడం అంటే ఇష్టం. ఆధునిక యుగం లో మానవుడు తనకు ఉన్న టెన్షన్ కి దూరం అవ్వాలంటే కచ్చితంగా ఒక వ్యాపకం కలిగి ఉండటం మంచిది.

ఇప్పుడు  మనం ఆక్వేరియం లో రంగు రంగుల చాపలను పెంచడం గురించి తెలుసుకుందాం.

మనకు అందుబాటులో ఉన్న చాపలు
1.    గోల్డ్ ఫిష్
2.    బెట్టా ఫిష్
3.    గప్పీస్
4.    మార్ఫ్ ఫిష్
5.    షార్క్ ఫిష్ మొదలగునవి.

చేపలను గాజు పలకలతో  చేసిన ఆక్వేరియం లో ఉంచుతారు. ఈ ఆక్వేరియంలు వివిధ ఆకృతులలో అందంగా  తాయారు చేస్తారు. ఆక్వేరియంలో పెంచుకొనే  చేపలను అన్ని పట్టన్నల్లో పలు దుకాన్నాల్లో అమ్ముతున్నారు.

ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచాలంటే ఆక్సిజన్ అవసరం. వాటికి ఆక్సిజన్ అందించే పరికరాన్ని ఎయిర్ పంప్ అంటారు. అంతే  కాక ఆక్వేరియం లో లైటింగ్ కూడా అవసరం. ఇక్కడికే అయిపోలేదు, నీళ్ళను శుభ్రపరిచే వాటర్ స్పాంజ్ ఫిల్టర్ కూడా అమర్చాలి. అప్పుడే చేపలు ఆరోగ్యంగా ఉంటాయి.

ప్రతి రోజు ఆక్వేరియంలో నీళ్ళను మార్చడం ఉత్తమం. అలా కాకపొతే కనీసం మూడు రోజులకైన మార్చాలి. అలా నీళ్ళు మార్చని యెడల చేపాలు అనారోగ్య పాలై చనిపోయే అవకాసం ఎక్కువ. నీళ్ళు మార్చిన తరువాత బ్యాక్టోనిల్ FW డ్రాప్స్ ని తగు మోతాదులో కలపాలి.

పగటి పూట తెల్లని కాంతి అందించే దీపాలని, రాత్రి పుట నీలం రంగు దీపాలని ఆక్వేరియం లో అమర్చాలి.   మీకో విషయం తెలుసా? చేపలు నిద్రపోతాయి కూడా. తెల్లటి రంగు దీపాన్ని  పగటి పూట పెట్టినందు వల్ల అవి మేలుకొని, వాటి దైనందిన జీవితం ఆరంభిస్తాయి. రాత్రి పూట నీలం రంగు దీపాలని వెలిగించినందు  వల్ల నిద్రపోతాయి. ఒక చేప కనీసం 6 గంటలు నిద్రపోతుంది.

ఆక్వేరియం లో చాపలకి వివిధ రకాలైన ఆహరం అందుబాటులో ఉన్నాయి. చిన్ని వృత్తాకార రూపంలో, కేకు రూపం లో దొరుకుతాయి.  ఒక్కో జాతి చేపకు  ఒక్క రకమైన ఆహరం ఉంటింది. మనం ఎలాంటి జాతి చాపలను పెంచుకొంటున్నమో తదనుగుణంగా ఆహారాన్ని మూడు పూటల అందించాలి.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.

మన ఇంట్లోనే వ్యవసాయం

ఇంటికి అందాన్ని మనకు ఆరోగ్యాన్ని తెస్తాయి చెట్లు.  మన ఇంటి ఆవరణం లో నాటుకోవడానికి ఎన్నో మొక్కలు  మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి కరివేపాకు, ఉసిరి, జామ, పనస, అంజూరం, ద్రాక్ష, మునగ, అవిశ, మామిడి, నేరేడు, సపోటా, కొండ రేగు మొదలగునవి.  మొక్కలే కాక తీగ జాతికి సంబందించిన సొర కాయ, పొట్ల కాయ, గుమ్మడికాయ, కాకర కయ, దొండ కయ మొదలగునవి మనకు అందుబాటులో ఉన్నాయి.

మునగ చెట్లు, కుంకుడు చెట్లు  మరియు కొండ రేగు చెట్లు ఇంటి ఆవరణం లో నాటడం అశుభం అని కొందరు అభిప్రాయ పడతారారు. అందుకని ఇలాంటివి మన ఇంటి బయట వేసుకోవడం ఉత్తమం.

ఇంట్లో నాటే మొక్కలు చిన్నవిగా ఉన్నందువల్ల  మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన ప్రహరి దాటి ఏ పశువులు లోనికి ప్రవేసించే అవకాసం ఉండదు గనుక.

ఇలాంటి చెట్ల వల్ల పిల్లలకు ఎంతో ఇష్టమైన అన్ని రకాల పండ్లు లభ్యం అవుతాయి. అంతే  కాక శుద్ధమైన గాలిని మనకు మరియు పర్యావణానికి అందిస్తాయి. పండ్ల చెట్లతో  పాటు కూరగాయ మొక్కలని, తీగలని పెంచు  కోవడం వల్ల మనకు కావలసినప్పుడు కావాల్సిన కూరగాయలు అందుబాటులో ఉంటాయి.

కరివేపాకు, పుదినా, కొత్తి మీరా, పచ్చి మిరయప కాయలు, టమేటాలు లేని కూరలు ఉండవు. ప్రతిరోజూ అంగడికి వెళ్లి ఇలాంటి నిత్యావసర కూరగాయలను కొనడం కంటే ఇంట్లోనే పెంచుకోవడం శ్రేష్ఠం. ఇవేకాక సొరకాయ, బీరకాయ, గుమ్మడి కూయ, తమలపాకు లాంటి తీగల్ని పెంచుకోవడం వల్ల పుష్కలంగా వాటికి వచ్చే కాయలు మనకు అందుబాటులో ఉంటాయి. సేంద్రియంగా మనం పెంచుకునే చెట్లకు వచ్చే పండ్లు, కాయలు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

రోజు వారి టెన్సన్స్ నుండి ఉపసమనం పొందడానికి కూడా ఈ వ్యాపకం ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ,తృప్తిని ఈ వ్యాపకం ద్వారా పొందగలం.



ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.

చెట్లు నాటడం లో మెలుకువలు

అందరికి వందనములు. వీధుల వెంట చెట్లు నాటడం చాల సులభం అని అనుకోవడం సర్వ  సాధారణం. నిజ రూపం లో చెట్లు నాటితే గాని మనకు ఆ అనుభవం రాదు. ఇప్పుడు నేను నా అనుభవాలను మీతో  పంచుకొంటున్నాను. ఇందులో ఎంతో ఒకంత మీకు ఉపయోగపడవచ్చు.

వీధుల వెంట నాటే చెట్లు ముఖ్యంగా  నీడనిచ్చేవి అయి ఉండాలి. ఉదాహరణకు  మనకు అందుబాటులో ఉన్న  తురాయి (గుల్మొహర్), కానగ, బాదం, స్పెతోడియా, మాను సంపెంగి, రావి, మర్రి, సప్త పర్ని (ఏడు ఆకుల చెట్టు), కదంబ,వేప, మలబార్ వేప, సీత అశోక, నర మామిడి  (అశోక) సీమ గంగిరేణి, నిద్ర గన్నేరు, కుంకుడు  మొదలగునవి. 

ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. రోడ్డు విస్తరణ లో భాగంగా ఎన్నో వేల చెట్లను మన  ఫారెస్ట్ డిపార్టుమెంటు ఆధ్వర్యం లో నేల కొరుగుతున్నాయి. మనం చెట్లు నాటే ముందు ఆ రోడ్డు ఎంత  వెడల్పు ఉన్నదో కచ్చితంగా తెలుసుకొని నాటడం అన్ని విధాల శ్రేయస్కరం .

ఇంకో విషయం ఏమిటంటే, కరెంటు వైర్లకు, స్థంబాలకు దగ్గరగా చెట్లు నాట కుండ ఉండటం  మంచిది. అలా నాటినందువల్ల, రానున్న కాలంలో కొమ్మలు పెరిగి విద్యుత్తు తీగలకు ఆటంకాన్నీ కలిగిస్తాయి. విద్యుత్తు శ్యాఖ వారు కొమ్మలను నరుకుతారు.

ఒక చెట్టు నాటడం చాల సులభం, దానిని  కాపాడటం చాల కష్టం. అందుకు చాల కారణాలు చాలానే ఉన్నాయి.  
ఉదాహరణకు...
1) ప్రతిరోజూ చెట్లకు అవసరమైనంత నీళ్ళు పోయడం.
2) చెట్లను మేకలనుంది, ఆవులు, బర్రెలు మొదలగు పశువుల నుండి కాపాడటం చాల కష్టమైన పని.
3) సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో మనం నాటిన చెట్లను కొంతమంది ఆసుయపరులు తుంచేసే సందర్బాలు కూడా మన ముందుకు వస్తాయి. వీటి నుండి మనం జాగ్రత్త వహించడం చాల అవసరం.  చిన్న మొక్కకి కంచే  (ట్రీ గార్డ్) అవసరం. కాని నా అనుభవం మేరకు ట్రీ గార్డ్ లేకుండా ఎత్తైన చెట్లను  కొని నాటడం మంచిది.  కనీస ఎత్తు పది నుండి పన్నెండు అడుగులు ఉండే విధంగా జాగ్రత్త పడితే  ఇంకా మంచిది. అందుకు కారణం లేకపోలేదు, ఎత్తైన చెట్లను జంతువులు భుజించలేవు.


ఉదాహరణకు కంచెకు (ట్రీ గార్డుకు) అయ్యే  ఖరీదు 500 రూపాయలు అనుకుంటే, నాటే చిన్న మొక్క ధర 100 రూపాయలు అనుకుంటే  మొత్తం ధర 600 అవుతుంది. అదే 600 రూపాయలకు 2 పెద్ద చెట్లు కొని నాటవచ్చు.  దీనివల్ల  మనకు రెట్టింపు  పచ్చదనాన్ని పొందే అవకాసం ఉంది.  ఒకవేళ 600 రూపాయలకు ఒక్క చెట్టు కొన్నా అది చాల పెద్దదిగా ఉండి , పచ్చదనం పెంచే దిశగా తొందరగా అడుగులు వేయగలదు.


ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టైతే లైక్  చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్  చేయండి.