అందరికి వందనములు. వీధుల వెంట చెట్లు నాటడం చాల సులభం అని అనుకోవడం
సర్వ సాధారణం. నిజ రూపం లో చెట్లు నాటితే గాని
మనకు ఆ అనుభవం రాదు. ఇప్పుడు నేను నా అనుభవాలను మీతో పంచుకొంటున్నాను. ఇందులో ఎంతో ఒకంత మీకు ఉపయోగపడవచ్చు.
వీధుల వెంట నాటే చెట్లు ముఖ్యంగా నీడనిచ్చేవి అయి ఉండాలి. ఉదాహరణకు మనకు అందుబాటులో ఉన్న తురాయి (గుల్మొహర్), కానగ, బాదం, స్పెతోడియా, మాను
సంపెంగి, రావి, మర్రి, సప్త పర్ని (ఏడు ఆకుల చెట్టు), కదంబ,వేప, మలబార్ వేప, సీత అశోక, నర మామిడి
(అశోక) సీమ గంగిరేణి, నిద్ర గన్నేరు, కుంకుడు మొదలగునవి.
ఇంతకంటే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. రోడ్డు విస్తరణ లో భాగంగా
ఎన్నో వేల చెట్లను మన ఫారెస్ట్ డిపార్టుమెంటు
ఆధ్వర్యం లో నేల కొరుగుతున్నాయి. మనం చెట్లు నాటే ముందు ఆ రోడ్డు ఎంత వెడల్పు ఉన్నదో కచ్చితంగా తెలుసుకొని నాటడం అన్ని
విధాల శ్రేయస్కరం .
ఇంకో
విషయం ఏమిటంటే, కరెంటు
వైర్లకు, స్థంబాలకు
దగ్గరగా చెట్లు నాట కుండ ఉండటం మంచిది. అలా
నాటినందువల్ల, రానున్న
కాలంలో కొమ్మలు పెరిగి విద్యుత్తు తీగలకు ఆటంకాన్నీ కలిగిస్తాయి. విద్యుత్తు శ్యాఖ
వారు కొమ్మలను నరుకుతారు.
ఒక చెట్టు
నాటడం చాల సులభం, దానిని
కాపాడటం చాల కష్టం. అందుకు చాల కారణాలు చాలానే
ఉన్నాయి.
ఉదాహరణకు...
1) ప్రతిరోజూ చెట్లకు అవసరమైనంత నీళ్ళు పోయడం.
2) చెట్లను మేకలనుంది, ఆవులు, బర్రెలు మొదలగు పశువుల నుండి కాపాడటం చాల కష్టమైన పని.
3) సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో మనం నాటిన చెట్లను
కొంతమంది ఆసుయపరులు తుంచేసే సందర్బాలు కూడా మన ముందుకు వస్తాయి. వీటి నుండి మనం జాగ్రత్త
వహించడం చాల అవసరం. చిన్న మొక్కకి కంచే (ట్రీ గార్డ్) అవసరం. కాని నా అనుభవం మేరకు ట్రీ
గార్డ్ లేకుండా ఎత్తైన చెట్లను కొని నాటడం
మంచిది. కనీస ఎత్తు పది నుండి పన్నెండు అడుగులు
ఉండే విధంగా జాగ్రత్త పడితే ఇంకా మంచిది. అందుకు
కారణం లేకపోలేదు, ఎత్తైన
చెట్లను జంతువులు భుజించలేవు.
ఉదాహరణకు
కంచెకు (ట్రీ గార్డుకు) అయ్యే ఖరీదు 500 రూపాయలు అనుకుంటే, నాటే చిన్న మొక్క ధర 100 రూపాయలు అనుకుంటే మొత్తం ధర 600 అవుతుంది. అదే 600 రూపాయలకు 2 పెద్ద చెట్లు కొని నాటవచ్చు. దీనివల్ల మనకు రెట్టింపు
పచ్చదనాన్ని పొందే అవకాసం ఉంది.
ఒకవేళ 600 రూపాయలకు ఒక్క చెట్టు కొన్నా అది చాల పెద్దదిగా ఉండి ,
పచ్చదనం పెంచే దిశగా తొందరగా అడుగులు వేయగలదు.
ఈ బ్లాగ్
మీకు నచ్చినట్టైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రిబ్ చేయండి.
No comments:
Post a Comment